- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్ల బ్యాడ్జీలతో ఆశా వర్కర్లు నిరసన
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా జీతాలు వారికి చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

దిశ, కోనరావుపేట : ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా జీతాలు వారికి చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మండల ఆశావర్కర్ల అధ్యక్షురాలు వరలక్ష్మీ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఆశా వర్కర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, పని చేసిన జీతం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ కష్టమవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలందరు ఆరోగ్యం ఉండాలనే లక్ష్యంతో మేము ఆరోగ్య సేవలు అందిస్తూ ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, మా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలు చెల్లించలేదని.. 2022 నుంచి 2025 వరకు రావాల్సిన రిస్క్ ఫండ్, వేతనాలు, అలవెన్సులు ఇవ్వలేదని పని ఒత్తిడి పెంచి, కనీస వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు. మా డిమాండ్లు అమలు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు జమున, అనురాధ, కరుణ, శారద, తామర, వనిత, సువర్ణ పాల్గొన్నారు.






