- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"పది"కి పకడ్బందీ ఏర్పాట్లు
మార్చి 14వ తేదీ శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : మార్చి 14వ తేదీ శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిర్ణీత పరీక్ష సమయం తరువాత ఐదు నిమిషాలు వరకు విద్యార్థులను అనుమతిస్తారు.
34 కేంద్రాల్లో పరీక్షలు
పదో తరగతి పరీక్షలకు జిల్లాలో మొత్తం 7317 మంది విద్యార్థులు హాజరుకానుండగా, బాలురు 3511, బాలికలు 3806 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో డెస్క్ లు, తాగునీరు, టాయిలెట్స్, ట్యూబ్ లైట్స్ ఇతర సౌకర్యాలు కల్పించారు. జిల్లాలో 34 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
144 సెక్షన్ అమలు..
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు.
పర్యవేక్షణకు బృందాలు..
పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెం డెంట్లు 34, డిపార్ట్ మెంటల్ అధికారులు 34, సిట్టింగ్ స్క్వాడ్ 34, ఫ్లయింగ్ స్క్వాడ్ రెండు టీంలు, అడిషనల్ డిపార్టుమెంటు ఆఫీసర్స్, స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్, కస్టోడియన్ అధికారులను నియమించారు.
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. పరీక్షల మధ్య విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షా సమయనికంటే ముందే చేరుకోవాలి.






