- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదాతలకు యాప్ కష్టాలు.. అవగాహన లేక అందని యూరియా
అన్నదాతలను యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. యాప్ పై అవగాహన లేకపోవడంతో అవసరమైన వారికి యూరియా అందడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, గంభీరావుపేట : అన్నదాతలను యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. యాప్ పై అవగాహన లేక యూరియా అందక ఇబ్బంది పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో వరి, మిర్చి తదితర పంటలు సాగు చేసిన రైతులు కొందరికి స్మార్ట్ ఫోన్లు లేక, మరికొందరికి పట్టాదారు పాస్‌బుక్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోకపోవడంతో ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ అధికారులు యాప్‌లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. యూరియా రావడంతో పది నిమిషాల్లో 420 బస్తాలు బుక్ అయిపోతున్నాయి. తెలియని రైతులు ఎలా బుక్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తెలిసిన వారు బుక్ చేసిన కానీ షాపుల నుంచి కానీ సొసైటీ నుంచి యూరియా తీసుకుపోవడం లేదు. అవసరమైన రైతులకు మాత్రం యూరియా దొరకడం లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక తలలు బాదుకుంటున్నారు. ఈ యాప్ ను గతంలో మాదిరిగా ఇవ్వాలని రైతుల కోరుతున్నారు.






