- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు ఘాట్‌రోడ్డులో మరో ప్రమాదం.. నలుగురికి గాయాలు
కొండగట్టు ఘాట్‌రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : కొండగట్టు ఘాట్‌రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయస్వామి ఆలయ ఘాట్ రోడ్డులో ఆటో ప్రమాదం గురయ్యి.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ దర్శనం ముగించుకున్న భక్తులు ఆటోలో కిందికి వస్తుండగా ఘాట్ రోడ్డులో ఆటో అదుపు తప్పి సైడ్ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డులో అధిక వేగంతో ఆటో నడపడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఇదే ఘాట్ రోడ్డు 2018లో బస్సు ప్రమాదానికి గురయ్యి 60కు పైగా మంది మరణించిన సంగతి తెలిసిందే. ఘాట్‌రోడ్డులో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.






