రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలో అమ్మోనియా లీక్.. ప్లాంట్ షట్‌డౌన్

by Muthe.Rajitha |

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)లో బుధవారం సాయంత్రం అమ్మోనియా వాయువులు లీక్ అయ్యాయి.

రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలో అమ్మోనియా లీక్.. ప్లాంట్ షట్‌డౌన్
X

దిశ, వెబ్ డెస్క్ : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)లో బుధవారం సాయంత్రం అమ్మోనియా వాయువులు లీక్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేసి ప్లాంట్‌ను షట్‌డౌన్ చేశారు. ఈ ఘటనలో కార్మికులు ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా లేదా అనే వివరాలు తెలియరాలేదు. సుమారు 15 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రూ. 200 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు సమాచారం.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో గల రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ గ్యాస్ ఆధారిత యూరియా తయారీ కర్మాగారం. రోజుకు 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఘటన వల్ల పర్యావరణ కాలుష్యం, భద్రతా సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు, సాంకేతిక వివరాలు ఇంకా బయటికి రాలేదు.

Next Story