అంబేద్కర్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం

by Ratna Kumari |

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమని, వారిని నిరంతరం స్మరించుకోవాలని నల్ల శ్యామ్ అన్నారు.

అంబేద్కర్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం
X

దిశ, జగిత్యాల టౌన్ : డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమని, వారిని నిరంతరం స్మరించుకోవాలని నల్ల శ్యామ్ అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు, డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్, అడ్వకేట్ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక తహసిల్ చౌరస్తా వద్దగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, సామాజిక న్యాయం, సంస్కరణలలో వారి ఆశయాలు, ఆలోచనలు, ఆదర్శాల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందాలనే లక్ష్యంతో ప్రతి ఆదివారం ఈ సత్సంఘాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఇప్పటికీ శక్తివంతంగా పని చేస్తూ పరిపాలన వ్యవహారాల్లో బడుగు, బలహీన వర్గాల హక్కులు, న్యాయం దక్కడంలో సజీవంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మట్టి పూలు సంపాదకులు తక్కళ్ళ దేవయ్య, తెలంగాణ శక్తి ఎడిటర్ అనంతుల కాంతారావు, జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాయితి శ్రీనివాస్, మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్, న్యాయవాదులు రాగం రమేష్, జిల్లా దళిత క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ ప్రవీణ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.

Next Story