మూడేళ్ల వయసులోనే అద్భుత ప్రతిభ

by Nallavelli.Anjaneyulu |

ఓ మూడేళ్ల బాలుడు మాత్రం తన అసాధారణ జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. భారతదేశంలోని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను గడగడా చెప్పేస్తూ.. భక్తి శ్లోకాలు, పద్యాలను అద్భుతంగా ఆలపిస్తూ అందరి చేత ‘శ‌బాష్‌’ అనిపించుకుంటున్నాడు. ​

మూడేళ్ల వయసులోనే అద్భుత ప్రతిభ
X

దిశ‌, హుజూరాబాద్ రూర‌ల్ : మూడేళ్ల వ‌య‌స్సు పిల్ల‌లు స‌రిగ్గా మాట‌లు రాక కొంత మంది ఇబ్బంది ప‌డుతుంటారు. మ‌రికొంత మంది ఆట‌పాట‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతారు. కానీ ఓ మూడేళ్ల బాలుడు మాత్రం తన అసాధారణ జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. భారతదేశంలోని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను గడగడా చెప్పేస్తూ.. భక్తి శ్లోకాలు, పద్యాలను అద్భుతంగా ఆలపిస్తూ అందరి చేత ‘శ‌బాష్‌’ అనిపించుకుంటున్నాడు. ​హుజురాబాద్ పట్టణంలోని బండ అంకుస్ వాడకు చెందిన స్నేహ - అర్జున్ దంపతుల కుమారుడు వడ్లకొండ ఇషాన్ కౌండిన్య (3) ప్రస్తుతం వరంగల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు.

చిన్న వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తి

​సాధారణంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సైతం దేశంలోని రాష్ట్రాలు, రాజధానుల పేర్లు గుర్తు పెట్టుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పని. కానీ ఇషాన్ కౌండిన్య మాత్రం మూడేళ్ల ప్రాయంలోనే మన దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను నోటిపైనే చెప్తూ విస్తుపోయేలా చేస్తున్నాడు. కేవలం జనరల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా.. హిందూ సంప్రదాయ శ్లోకాలు, పద్యాలను కూడా ఎంతో స్పష్టంగా, అద్భుతంగా పఠిస్తున్నాడు.

​తల్లిదండ్రుల హర్షం..

"ఇషాన్ చిన్నతనం నుంచే విషయాలను చాలా త్వరగా గ్రహించేవాడు. వాడి ఆసక్తిని గమనించి మేము కూడా ప్రోత్సహించాం. ఇంత చిన్న వయసులోనే వాడు చూపిస్తున్న ప్రతిభ మాకెంతో గర్వకారణంగా ఉంది" అని బాలుడి తల్లిదండ్రులు స్నేహ, అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. ​అత్యంత ప్రతిభ కనబరుస్తున్న చిన్నారి ఇషాన్ కౌండిన్యను స్థానికులు, పాఠశాల యాజమాన్యం, పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ చిన్నారి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Next Story