గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా విస్తృత తనిఖీలు...

by Taduka Kalyani |

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పట్టణంలో బుధవారం ఉదయం పట్టణ పోలీసులు ఎస్ఐ జాడి శ్రీధర్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా విస్తృత తనిఖీలు...
X

దిశ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పట్టణంలో బుధవారం ఉదయం పట్టణ పోలీసులు ఎస్ఐ జాడి శ్రీధర్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా రామకృష్ణాపూర్ లోని వివిధ కాలనీ లలో పోలీసులు తనిఖీ చర్యలు చేపట్టారు. గంజాయి సేవించేవారు, విక్రయించే వారిపై వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా అనుమానితుల ఇళ్లలో ఎట్టకేలకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ జే.శ్రీధర్ మాట్లాడుతూ.. పోలీసుల తనిఖీల్లో ప్రత్యేకంగా నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపడం జరిగిందన్నారు. ఈ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఎక్కడైనా గంజాయి దాచి ఉంచితే సులభంగా పసిగట్టవచ్చని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. పట్టణంలో ఎవరికైనా గంజాయి తాగే అలవాటు ఉన్నా లేదా విక్రయించిన తక్షణమే అలవాట్లు మానుకోవాలని సూచించారు. లేనిపక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీధర్ హెచ్చరించారు.​ తెలంగాణ ప్రభుత్వం గంజాయి మహమ్మారిని పూర్తిగా అరికట్టడానికి ఈగల్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ బృందం నిరంతరం నిఘా ఉంచుతూ గంజాయి రహిత సమాజం కోసం కృషి చేస్తోందని ఎస్ఐ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కడైనా మాదక ద్రవ్యాలు సేవించిన, విక్రయించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి రహిత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ శ్రీధర్ ప్రజలను కోరారు.

Next Story