అభ్యర్థుల ప్రకటనతో పాటే.. డబ్బు సంచులు పంపుతున్నారు : MLC Jeevan Reddy సంచలన వ్యాఖ్యలు.

by Kema Shiva Kumar |   (  Updated:2023-08-23 13:30:31  IST  )

పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పార్టీ పై హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పాటే డబ్బు సంచులు పంపిణీ చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అభ్యర్థుల ప్రకటనతో పాటే.. డబ్బు సంచులు పంపుతున్నారు : MLC Jeevan Reddy సంచలన వ్యాఖ్యలు.
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పార్టీ పై హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పాటే డబ్బు సంచులు పంపిణీ చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఒక్కో అభ్యర్థికి ఫస్ట్ ఫేజ్ కింద రూ.10 కోట్ల డబ్బు సంచలు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ వస్తే ముమ్మర తనిఖీలు ఉంటాయనే ఒక్కో అభ్యర్థికి విడతల వారీగా డబ్బు పంపిణీ చేస్తున్నారని అన్నారు.

ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో నెలకు రూ.10 కోట్ల చొప్పున పంపించే విధంగా ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. ఇదేమి రాజ్యమో జనాన్ని దోచిన సొమ్మునే.. ఎలక్షన్లలో పెట్టి గెలుస్తారా అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే, ప్రజలు అంతా గమనిస్తున్నారని డబ్బు, మద్యం ఎంత పంచి పెట్టిన ప్రజల ఆశీస్సులతో తాను తప్పకుండా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story