- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ ఫ్యాన్స్ వినూత్న సేవా కార్యక్రమాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శీలం విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినూత్న సేవా కార్యక్రమాలు చేపట్టారు.

దిశ, వేములవాడ టౌన్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శీలం విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినూత్న సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహిళల్లో గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించేందుకు HPV వ్యాక్సిన్ పోస్టర్‌ను తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్ గారిని, వారి ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అల్లు అర్జున్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కొండ దేవయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ చరణ్, వేములవాడ టౌన్ ఫ్యాన్స్ తిరుపతి, విక్రమ్ యాదవ్, త్రినాథ్, శ్రీపతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు






