- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మహిళా సర్పంచ్ ఆరోపణలు అసత్యం
మాజీ మహిళా సర్పంచ్ మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ పై చేసిన ఆరోపణలు అసత్యం అని చింతగుట్ట గ్రామస్తులు ఖండించారు.

దిశ, శంకరపట్నం : మాజీ మహిళా సర్పంచ్ మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ పై చేసిన ఆరోపణలు అసత్యం అని చింతగుట్ట గ్రామస్తులు ఖండించారు. అంబేద్కర్ కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ గ్రామ ఉప సర్పంచ్ ఆడెపు సుధాకర్ మాట్లాడుతూ శంకరపట్నం మండలంలోని చింతగుట్ట గ్రామంలో కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా గురువారం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దానిపై రాద్ధాంతం చేస్తున్న మాజీ సర్పంచ్ ఆడెపు రజిత వ్యవహార శైలిపై భగ్గుమన్నారు. సర్పంచ్ గా ఉన్నప్పుడే అంబేద్కర్ విగ్రహం కోసం గ్రామంలోని ఓ దాత వద్ద బారీ గా డబ్బులు వసూలు చేసిందని ఆ డబ్బుల లెక్కలు అడుగుతారనే ఉద్దేశం కొద్దీ సమస్యను పక్కదారి పట్టించేలా తనను ఆహ్వానించలేదని అసత్య ఆరోపణలు చేస్తుందని అన్నారు.
గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఓ కమిటీని వేశామని ఆ కమిటీలో మాజీ సర్పంచ్ భర్త కూడా సభ్యుడుగా ఉన్నారని ప్రతి విషయం కమిటీలో ఉన్న సభ్యులు చర్చించుకొని పని చేశామన్నారు. మాజీ సర్పంచ్ ని ఆహ్వానించినప్పటికీ కావాలనే విగ్రహ ఆవిష్కరణకు హాజరు కాకుండా వివాదం రాజేశారని అన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణకు కానీ మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ కానీ ఈ వివాదంతో సంబంధం లేదని అంబేద్కర్ కమిటీ నియమాలు నిబంధనల మేరకే అందరిని ఆహ్వానించామని శిలాఫలకంలో పేర్లను కూడా ఆ మేరకే పెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింత గుట్ట గ్రామస్తులతో పాటు కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.






