14 ఏళ్ల బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలి

by Nallavelli.Anjaneyulu |

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ శుక్రవారం హుజూరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

14 ఏళ్ల బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలి
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ శుక్రవారం హుజూరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ సెంటర్‌ను పరిశీలించి, వ్యాక్సినేషన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 14 ఏళ్లు నిండిన బాలికలను గుర్తించి, వారికి హెచ్‌పీవీ టీకాపై అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అర్హులైన ప్రతి బాలిక వ్యాక్సిన్ సెంటర్‌కు వచ్చేలా మోటివేట్ చేయాలని, క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

​చల్పూర్ పీహెచ్‌సీలో తనిఖీ..

అనంతరం ఆయన హుజురాబాద్ మండలంలోని చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఆయన, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వ్యాక్సిన్ నిల్వ ఉంచే కోల్డ్ చైన్ స్టేటస్‌ను, లేబర్ రూమ్, మందుల స్టోర్ రూమ్‌ను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణీలకు భరోసా కల్పించాలని, వైద్య సేవలలో ఎటువంటి అలసత్వంవహించకూడదని స్పష్టం చేశారు.​ ఈ కార్యక్రమంలో చల్పూర్ వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయ సీహెచ్‌ఓ సదానందం, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, హెచ్‌ఈఓ విజయేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story