రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అక్షయ ఎంపిక

by Dishanational1 |
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అక్షయ ఎంపిక
X

దిశ, చందుర్తి: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గాజే అక్షయ రాష్ట్ర స్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. ఈనెల 27వ తేదీ నుంచి 30 వరకు వేములవాడలో జరగనున్న స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా వాలీబాల్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికైంది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గంగం మహేష్ ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వాలీబాల్ అధ్యక్షులు వేణు, కిషన్ రావు, గిన్నె లక్ష్మణ్, సీనియర్ క్రీడాకారులు గాజుల వేణు, దేవయ్య, శ్రీ కుమార్ రాందాస్, కరుణ వత్తుల చందు, దయ్యాల శ్రీనివాస్ దయ్యాల నారాయణ అభినందించారు.



Next Story

Most Viewed