అమాయకులే టార్గెట్..​ అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్ మెంట్ ఆకృత్యాలు

by Ajay Maddhiboyina |

ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్మెంట్ యాజమాన్యం మోసాలకు పాల్పడుతుంది.

అమాయకులే టార్గెట్..​ అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్ మెంట్ ఆకృత్యాలు
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్మెంట్ యాజమాన్యం మోసాలకు పాల్పడుతుంది. అమాయకులే టార్గెట్ గా శ్రమ దోపిడీ చేస్తుంది. నెలనెల జీతాలు చెల్లించకుండా ఉద్యోగులతో వెట్టిచాకిరి చేపించుకుంటున్నారు. జీతం కావాలంటూ అడిగితే ఇక నీవు మాకు వద్దు అంటూ ఉద్యోగం నుంచి తొలగిస్తూ వేధిపులకు పాల్పడుతున్నారు. జీతం కోసం ఆఫీసు చుట్టూ తిరిగిన కనికరించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నెలలు గడచిన జీతాలు చెల్లించక పోవడంతో అక్షర అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్ మెంట్ మోసానికి గురైన బాధితులు న్యాయం కోసం అధికారులను వేడుకుంటున్నారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లో అక్షర ఆకృత్యాలు

అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్ మెంట్ తన అక్రమ సామ్రాజ్యాన్ని మూడు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించుకుని ఆకృత్యాలకు పాల్పడుతుంది. కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లోలోని పలు ప్రయివేటు సంస్థలతో సెక్యూరిటీ తో పాటు ఇతరత్ర లేబర్ ను సమకూరుస్తామంటూ ఎక్కువ మొత్తంలో సదరు సంస్థలతో అగ్రిమెంటు చేసుకుని అమాయకులైన నిరుద్యోగులకు తక్కువ జీతాలు చెల్లిస్తూ వెట్టిచాకిరి చేపించుకుంటున్నారు. కార్మికులకు నెలనెల జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సంస్థలో జాయిన్ అయిన వారికి మొదటి నెల జీతం ఇవ్వాలంటే మీ పర్మామెన్స్ సరిగా లేదంటూ కోతలు విధిస్తూ మీ పై సదరు సంస్థలు ఫిర్యాదులు చేశాయి అంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. జీతం సరిపోవడం లేదంటూ పనిచేసినప్పటికి పూర్తి జీతం ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తే ఇక ఉద్యోగులపై సదరు నిర్వాహకుడి ప్రతాపం మాటల్లో చెప్పలేం. ఇలా ఉమ్మడి మూడు జిల్లాలో అక్షర బాధితులు వేతానాలకోసం వెతలు అనుభవిస్తూ న్యాయం కోసం అదికారులను వేడుకుంటున్నారు

కార్మిక చట్టాల ఉల్లంఘన

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఏజెన్సీని నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ జీతాల్లో కోతలు విధిస్తున్నారు కనీస వేతనాలు చెల్లించాలంటూ నిబంధనలు ఉన్నప్పటికి ప్రయివేటు సంస్థలతో వేతన చట్టాల ప్రకారం అగ్రిమెంట్లు చేసుకుంటూ కార్మికులకు మాత్రం అరకొర జీతాలు చెల్లిస్తూ ఏజెన్సీలు తమ కజానా నింపుకుంటున్నాయి. ఈఎస్ఐ, పీఎఫ్ నిబంధనలు ఎక్కడ పాటించిన దాఖలాలు లేవు. అంటే ఏజెన్సీలను నిర్వహకులు ఏస్థాయిలో నడిపిస్తున్నారో అర్థం అవుతుంది

కరువైన అధికారుల నియంత్రణ

ఏజెన్సీల పేరుతో కొన్ని సంస్థలు నిరుద్యోగులకు గాలం వేసి ప్రయివేటు సంస్థల్లో పని కావాలంటే రూ.50 వేల నుంచి సుమారుగా లక్ష రూపాయల వరకు వసూల్ చేస్తున్నట్టు గా బాధితులు వాపోతున్నారు. అదనంగా ఉద్యోగం చేయాలి అంటే మా సంస్థ యూనిఫామ్ ధరించాలంటూ చెప్పుకొస్తున్న అక్షర సెక్యూరిటీ పెసిలిటి మేనేజ్ మెంట్ నిర్వాహకులు అమాయకుల నుంచి డ్రెస్ కోసం అంటూ ఐదు వేల రూపాయలు వసూల్ చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న వారికి జీతం సమయంలో మీకు పీఎఫ్​ చెల్లిస్తున్నాం అంటూ ఎక్కడా చెల్లించకుండా పీఎఫ్​ నంబరు కూడ ఆన్ లైన్ లో క్రియేట్ చేయకుండానే జీతాల్లో కోతలు పెడుతూ దోచేసుకుంటున్నారు. ఏజెన్సీల పై ప్రభుత్వ నియంత్రణ కరువవ్వడంతో విచ్చల విడిగా ఏజెన్సీలను నెలకోల్పుతున్న నిర్వాహకులు నిబంధనలను గాలికి వదిలేస్తున్న ఏజెన్సీల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు .

ఖాకీల పేరుతో అమాయకులకు టోకరా?

ప్రభుత్వ ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్ మెంట్ అమాయకులను బుట్టలో వేసేందుకు ఖాకీలను సైతం వదలడం లేదు. మా ఏజెన్సీ పోలీసు అధికారుల సారథ్యంలో నడుస్తుంది అంటూ నమ్మబలుకుతూ అమాయకులకు గాలం వేస్తున్నారు. తన వద్ద ఉద్యోగం కోసం వచ్చిన వారిలో శరీరం దారుడ్యం ఉన్నవారిని ఎంచుకుని వారికి పోలీసు అధికారులకు గన్ మెన్ లు ధరించే సఫారీలు ధరింప చేసి అక్కడికి వచ్చిన వారికి పోలీసులతో నిజంగానే సంబంధాలు ఉన్నాయి అనే భ్రమ కలిగిస్తూ వారు తన గన్ మెన్ లు అని చెప్పుకోవడం అక్కడికి వచ్చిన వారికి అనుమానం కలగకుండా వ్యవహరించడం తో అమాయకులు నిజమే కావచ్చు అని అడిగినంత చెల్లిస్తూ ఉద్యోగం లో చేరుతున్నారు. సమయానికి జీతాలు చెల్లించకపోయినా అడిగేందుకు భయపడుతూ కాలం వెల్లదీస్తున్నారు. జీతం ఇస్తే తీసుకుంటున్నారు. లేదు అంటే వదిలేసి అడగలేక వెళ్లిన వారి జాబితా చాంతాడంత అంటే ఆశ్చర్యం లేదు.

Next Story