వ్యాపారులకు ఫోన్ కాల్.. ఆ ఫీజులు చెల్లించాలంటూ బెదిరింపులు

by Bhanu |

పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి వివిధ వ్యాపార సంస్థల యజమానులకు ఫోన్ చేసి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని బెదిరింపు పాల్పడుతున్నారని మున్సిపల్ కమీషనర్ నాగరాజు తెలిపారు.

వ్యాపారులకు ఫోన్ కాల్.. ఆ ఫీజులు చెల్లించాలంటూ బెదిరింపులు
X

దిశ, చొప్పదండి : పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి వివిధ వ్యాపార సంస్థల యజమానులకు ఫోన్ చేసి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని బెదిరింపు పాల్పడుతున్నారని మున్సిపల్ కమీషనర్ నాగరాజు తెలిపారు. గురువారం 08247649631 నంబర్ నుండి మున్సిపల్ కమీషనర్ కార్పొరేషన్ ఆఫీస్ తెలంగాణ అనే ట్రూ కాలర్ ఐ డి ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వాట్సాప్ క్యూ ఆర్ కోడ్ కు డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి ఫేక్ క్యూ ఆర్ కోడ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని కమీషనర్ తెలిపారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏదైనా సందేహాలు ఉన్న యెడల మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ నెంబర్లకు మున్సిపల్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని, ఈలాంటి ఫోన్ కాల్స్ మళ్ళీ వస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు.

Next Story