గ్రామ పంచాయతీలకు ఇన్చార్జి కార్యదర్శుల పాలన

by velandi.Saikiran |

మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 21 గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు.

గ్రామ పంచాయతీలకు ఇన్చార్జి కార్యదర్శుల పాలన
X

గ్రామ పంచాయతీలకు..ఇన్చార్జి కార్యదర్శుల పాలన

మండలంలో ఇలాగైతే పాలన సాగేదేలా?

ఆయా గ్రామాల సర్పంచ్ లు ఇబ్బందులు

దిశ, ఎల్లారెడ్డిపేట : మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 21 గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇందులో ఐదు గ్రామ పంచాయతులకు ఇన్చార్జి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండలంలోని హరిదాస్ నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ రాట్లపల్లి ఇంచార్జ్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం రమేష్ సెలవు పై వెళ్లడంతో ఆయన స్థానంలో అగ్రహారం పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న పూజకు రాగట్లపల్లి ఇన్చార్జి కార్యదర్శిగా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. నారాయణపూర్ లో ఇన్చార్జి కార్యదర్శిగా సింగారం గ్రామ కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు పని చేసిన కార్యదర్శి పదవి విరమణ పొందారు. ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన తంగేడి పల్లి ప్రవీణ్ కుమార్ సొంత జిల్లాకు బదిలీ కాగా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాలకృష్ణకు ఇన్చార్జి కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన రాచర్ల బాకుర్పల్లికి ఇన్చార్జి కార్యదర్శిగా బాకుర్ పల్లి తండా కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నారు. జై సేవాలాల్ తండాకి సంపత్ ఇన్చార్జి కార్యదర్శిగా తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నారు.

ఇన్చార్జి కార్యదర్శులతో ఇబ్బందులు?

ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ తోపాటు రాగట్లపల్లి, నారాయణపూర్, రాచర్ల బాకుర్పల్లి, జై సేవాలాల్ తండా లకు ఇన్చార్జి కార్యదర్శులు పని చేస్తుండగా పూర్తిస్థాయి కార్యదర్శులు లేకపోవడంతో రెండు గ్రామాలకు ఒకరు చొప్పున అదనంగా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుండడంతో గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కారోబార్లకు జూనియర్ అసిస్టెంట్లకు పారిశుధ్య నిర్వహణ అదనపు భారంగా మారుతుంది. ఇన్చార్జి కార్యదర్శుల పనితీరుతో ఆయా గ్రామాల సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్చార్జి కార్యదర్శుల పనితీరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళిక పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఇంచార్జి కార్యదర్శుల స్థానంలో పూర్తిస్థాయి కార్యదర్శులను నియమించాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరుతున్నారు.

Next Story