నూతన మంత్రి "అడ్లూరి"ని అభినంధించిన కిషన్ రెడ్డి

by Bhanu |   (  Updated:2025-06-08 12:29:53  IST  )

ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్‌గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు చందయ్యాపల్లె మాజీ సర్పంచ్ ఎన్నం కిషన్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

నూతన మంత్రి అడ్లూరిని అభినంధించిన కిషన్ రెడ్డి
X

దిశ, బుగ్గారం : ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్‌గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు చందయ్యాపల్లె మాజీ సర్పంచ్ ఎన్నం కిషన్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఆదివారం నాడు హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మణ్ కుమార్ వంటి యువ, ప్రజానిర్వాహకుడైన నాయకుడు మంత్రిగా ప్రమాణ స్వీకరించడం జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు. ఆయన సామాజిక న్యాయం, పల్లె అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టితో పనిచేస్తారని అభిప్రాయపడ్డారు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గం ధర్మపురిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని, ఇక రాష్ట్ర స్థాయిలో మంత్రిగా మరిన్ని ప్రజాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తారన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, అభిమాని నాయకులు కూడా పాల్గొన్నారు.

Next Story