మంత్రిగా తొలిసారి జిల్లా కేంద్రానికి అడ్లూరి..

by Bhanu |

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారి జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు.

మంత్రిగా తొలిసారి జిల్లా కేంద్రానికి అడ్లూరి..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారి జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణం లోని టౌన్ హాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయ జీవితంలో అన్ని రకాల సమయాల్లో అండగా ఉన్న జీవన్ రెడ్డి సహకారంతో మరింత ముందుకు సాగుతానని అన్నారు.

పదవులు ఆశించకుండా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లానని తనకు మంత్రి పదవి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అధిష్టానంతో పాటు సీఎం తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాసేవ చేస్తానని అన్నారు. ఇదే రోజు సాయంత్రం క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని అభివృద్ధి విషయంలో అందరిని కలుపుకొని పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు, సీనియర్ నాయకులు కొమురెడ్డి కరం, విజయలక్ష్మీ, బండ శంకర్ లు ఉన్నారు.

Next Story