కొండగట్టు ఆలయ ఈఓపై చర్యలు తీసుకోవాలి

by velandi.Saikiran |

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు అర్చకులను అనరాని, వినరాని మాటలతో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని జగిత్యాల జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

కొండగట్టు ఆలయ ఈఓపై చర్యలు తీసుకోవాలి
X

దిశ, జగిత్యాల టౌన్: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు అర్చకులను అనరాని, వినరాని మాటలతో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని జగిత్యాల జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఘటనతో సంబంధం లేని అర్చకుడిని అకారణంగా దూషించడం తీవ్రంగా తప్పని పేర్కొన్నారు. ఈఓ వైఖరి అర్చకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, వెంటనే ఆయనను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కూర్మాచలం రఘునందన్‌, మధుసూదన స్వామి, పరాంకుశం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story