- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ మృతి కారకులపై చర్యలు తీసుకోవాలి
మండల కేంద్రంలో భూ వివాదంలో జరిగిన గొడవలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కేతిరి లక్ష్మి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

దిశ, ముత్తారం : మండల కేంద్రంలో భూ వివాదంలో జరిగిన గొడవలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కేతిరి లక్ష్మి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు ముత్తారం మండల కేంద్రంలో రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు ముత్తారం గ్రామం ఎరుకల కులానికి చెందిన కేతిరి లక్ష్మి కుటుంబం కొద్ది రోజులుగా మండల కేంద్రంలోని ఒక స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంది. ఇటీవల ఆ స్థలానికి చెందిన యజమానులు ఆ భూమిని గ్రామంలో నిర్మించబోయే రామాలయం ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు. గుడి నిర్మాణం చేపట్టిన గ్రామస్తులు కేతిరి లక్ష్మి నివాసం తొలగించాలని ఒత్తిడి తీసుకురావడంతో మనస్థాపంతో వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. చికిత్స పొందుతూ లక్ష్మి శుక్రవారం మృతి చెందింది.
లక్ష్మీ మృతికి గ్రామానికి చెందిన కొంత మంది పెద్ద మనుషులు వేధింపులే కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ చౌరస్తాలో ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు మంథని కి చెందిన ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కసార్లగడ్డ బస్టాండ్ వద్ద లక్ష్మి ఫోటో బయట నుంచి లక్ష్మి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరిఖని ఏసీపీ, మంథని సిఐ ఆధ్వర్యంలో మంథని రామగిరి ముత్తారం ఎస్సైలు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.






