హత్య కేసులో నిందితుడి అరెస్ట్

by Ratna Kumari |

ఈ నెల 21న‌ మండలంలోని సెంటినరీ కాలనీలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు.

హత్య కేసులో నిందితుడి అరెస్ట్
X

దిశ, రామగిరి : ఈ నెల 21న‌ మండలంలోని సెంటినరీ కాలనీలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. బేగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బుర్ర రాజకొమురయ్య(65) సెంటినరీకాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ వద్ద పాత కక్షలను మనసులో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన మొలుగూరి కొమురయ్య(58)ను శ‌నివారం దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. సోమవారం ఆయన రామగిరి పోలిస్ స్టేషన్ లో విలేకర్ల స‌మావేశం నిర్వ‌హించారు. . ఏసీపీ మాట్లాడుతూ 2011లో నిందితుడి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా.. తన కుమారుడి చావుకి మొలుగూరి కొమురయ్య, మొలుగూరి సత్తయ్య కారణమని పగ పెంచుకున్నట్లు తెలిపారు. శనివారం బంధువుల పెళ్లికి వచ్చిన తమ్ముడిపై నిందితుడు కత్తితో దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన అన్నపై కూడా కత్తితో దాడికి దిగడంతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రామగిరి ఎస్సై తాడవేన శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టగా కల్వచర్ల పంచాయతీ పరిధి మారుతి నగర వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, దాడికి ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాదరావు, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story