ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం

by Disha Web Desk 15 |
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
X

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో భోగ సుమలత, రాజు నివసించే గృహం శనివారం ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడం వలన ప్రాణ నష్టం తప్పింది. పెద్దపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి వేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మండల రెవెన్యూ అధికారి మధుసూదన్ రెడ్డి తక్షణ సహాయం కింద ఐదు వేల రూపాయలు బాధితురాలు భోగ సుమలతకు అందజేశారు.

Next Story

Most Viewed