అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. దంప‌తుల‌కు గాయాలు

by Ratna Kumari |

అంత్య‌క్రియ‌ల కోసం దంప‌తులు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఆ దంప‌తుల‌కు గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది.

అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. దంప‌తుల‌కు గాయాలు
X

దిశ, శంకరపట్నం : అంత్య‌క్రియ‌ల కోసం దంప‌తులు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఆ దంప‌తుల‌కు గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామానికి చెందిన శనిగరపు సంపత్ (38) భార్య మౌనికతో కలిసి చిగురు మామిడికి వెళ్లి తిరిగి వస్తుండగా.. కేశవపట్నం చర్చ్ సమీపంలోకి రాగానే ఓ కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో దంప‌తులిద్ద‌రికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో సిబ్బంది ఈఎంటీ గూడూరు సతీష్ రెడ్డి పైలెట్ గోపికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని క్షత గాత్రులను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Next Story