కోరుట్ల మున్సిపల్ కమిషనర్ కారు వివరాలు కావాలి

by velandi.Saikiran |

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ కారు వివ‌రాలు కావాల‌ని ఓ యువకుడు RTI చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు.

కోరుట్ల మున్సిపల్ కమిషనర్ కారు వివరాలు కావాలి
X

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ కారు వివ‌రాలు కావాల‌ని ఓ యువకుడు RTI చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే... కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవిందర్ గౌడ్ వ్యవహారశైలిపై మాకు అనుమానంగా ఉందని, వివిధ అంశాలపై మేం ఎన్నిసార్లు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నా..'థర్డ్ పార్టీ' అని..చేతులు దులిపేసుకుంటూ 'మొక్కుబడి' సమాధానాలు ఇస్తున్నార‌ని కటకం చంద్ర శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే క‌మిష‌న‌ర్ కారు, అతని డ్రైవర్ వివరాలు కావాలని మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు చంద్ర శేఖ‌ర్‌. ఈ వ్యవహారం పట్టణంలో చర్చానీయాంశమైంది. గత నెల 27 నుంచి ఆయన వాడుతున్న కారు యజమాని వివరాలు కావాలని ఆ దరఖాస్తులో కోరారు. అలాగే ఆయ‌న కారు డ్రైవర్ సానిటరీ వర్కరా...? లేక కాంట్రాక్టు టెండర్ కు సంబంధించిన వ్యక్తా...? వీటితో పాటు ఆ డ్రైవర్ జీత-భత్యాల గురించి వివరాలు కావాలని చంద్రశేఖర్ ఆ దరఖాస్తులో కోరారు.

Next Story