వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా.. కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి

by velandi.Saikiran |

వినాయకుని విగ్రహాన్ని తీసుకెళ్తుండగా కరెంటు షాక్ తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి

వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా.. కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి
X
  • వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విషాదం
  • కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి
  • నిజామాబాద్ జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో ఘటన

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : వినాయకుని విగ్రహాన్ని తీసుకెళ్తుండగా కరెంటు షాక్ తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన కొందరు యువకులు నిజామాబాద్ జిల్లా పెర్కిట్ నుంచి గణపతి విగ్రహాన్ని తీసుకువస్తుండగా పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో ఈ ఘటన జరిగింది. 11 కేవీ కేబుల్ తగిలి సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కు చెందిన లక్ష్మీనారాయణ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ప్రాథమిక సమాచారం.

Next Story