- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ లో చిచ్చురేపిన మాటల యుద్ధం
ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో మిఠాయిలు పంచుతుండగా.. ఒక్కసారిగా తీవ్ర వివాదానికి దారి తీసింది.

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో మిఠాయిలు పంచుతుండగా.. ఒక్కసారిగా తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇరువురు నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం చెలరేగడంతో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జోక్యం చేసుకోవడంతో వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తో పాటు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. గృహప్రవేశ అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వివిధ పార్టీ హోదాల్లో ఉన్న నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ పేరును ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించలేదు.
మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అక్కడ నాయకులకు, కార్యకర్తలకు మిఠాయి పంచుతూ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాహెబ్ వద్ద కు వెళ్లి స్వీటు తీసుకోమని అంటూ దగ్గరికి వెళ్ళగా.. అప్పటికే ఊగిపోతున్న సాహెబ్ కార్యకర్తల సమక్షంలో బాటంగా ఇరువురు తీవ్రంగా విమర్శించుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఇరువురి మధ్య దూషణాలపర్వం కొనసాగింది. మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సాహెబ్ పై బూతు పురాణాన్ని కొనసాగించారు. దీంతో అక్కడే ఉన్న డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లాలో జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి, రెండు వర్గాలుగా కొనసాగుతున్నాయి.






