నీరుగారుతున్న సమాచార హక్కు చట్టం

by velandi.Saikiran |

సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల వైఖరితో కార్యాలయాల్లో దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి.

నీరుగారుతున్న సమాచార హక్కు చట్టం
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ప్రభుత్వ అధికారుల పనితీరు సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సమాచార హక్కు చట్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారుల తీరుతో నీరుగారుతుంది. చట్టం లోని లొసుగులను అడ్డం పెట్టుకుని సమాచారం ఇచ్చేందుకు అధికారులు తిరకాసుపెడుతుంటే అడిగిన సమాచారం అందక బాధితుల ఫిర్యాదులు కార్యాలయాల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి .దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు అమలు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి

అడిగింది ఇవ్వం చేసేది చెప్పం

సమాచార హక్కు చట్టం అమలుపై ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిన అమలు చేసే అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లలో పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా తయారైంది. కరీంనగర్ కార్పొరేషన్ లో అధికారులు మరో అడుగుముందుకు వేసి వ్యవహరిస్తున్నారు. ఏది అడిగినా అది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు అంటూ

కాలయాపన చేస్తున్న అధికారులు అడిగింది ఇవ్వం చేసేది చెప్పం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నెలల తరబడి అడిగిన సమాచారం కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలల తరబడి బాధితులు కార్యాలయం చుట్టు తిరిగినా అడిగిన సమాచారం చేతికిరాక ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు అసలు కరీంనగర్ జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు జరుగుతుందా.. అనే సందేహలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి

పేరుకుపోతున్నా దరఖాస్తులు

సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల వైఖరితో కార్యాలయాల్లో దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. బాధితులు సమాచార హక్కు చట్టంతో ఏ సమాచారం అడిగినా చట్టం లోని లొసుగులను ఆసరా చేసుకుంటున్న అధికారులు ముందుగా ఫిర్యాదు దారులను సమాచారం ఇచ్చేందుకు వేలల్లో చెల్లించాలంటూ నోటీసులు ఇస్తూ డిజిటల్ గా సీడీ పెన్ డ్రైవ్ తదితర పద్దతుల్లో సమాచారం ఇవ్వొచ్చు అనే విషయాన్ని దరఖాస్తు దారులకు చెప్పకుండా తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో వేల రూపాయలు చెల్లించలేక అడిగిన సమాచారం అందక ఫిర్యాదుదారులు మరో సమాచారాన్ని అడిగేందుకు జంకుతున్నారు. దీంతో సమాచారం కోసం బాధితులు చేసుకున్న దరఖాస్తులు కార్యాలయాల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి

మేము ఫిర్యాదులో సమర్పించిన

కాపీలు ఇవ్వడం లేదు

తనుకు జయలక్ష్మి అశోక్ నగర్

సుదీంద్ర ఓనర్లపై కోర్ట్ ఆర్డర్లో నాటు కాంట్రాక్ట్ అని ఉండగా ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ కన్​స్ట్రక్షన్​పర్మిషన్ ఇవ్వలేదు కాకుండా పై ఓనర్లు కన్​స్ట్రక్షన్​ చేశారు. మళ్లీ కోర్టులో కేసు వేయగా నాటు కన్​స్ట్రక్షన్​అని సెకండ్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వొద్దని కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ పక్కనపెట్టి సెకండ్ ఫ్లోర్ కూడా మున్సిపల్ వాళ్లు పర్మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఓనర్లు కూడా సెకండ్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేశారు. దీనిపైన మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్ కింద కంప్లైంట్ చేశాం. 6-7- 2022 నాడు రెండు పార్టీలను హియరింగ్ రమ్మని పిలిచారు. కంప్లైంట్ చేసిన పార్టీ మొత్తం ఆధారాలతో సమర్పించడం జరిగింది. కానీ రెండో పార్టీ తన కన్​స్ట్రక్షన్​సమర్థించడానికి ఏ ఏ పత్రాలు సమర్పించిందో తెలపాలని 29-07-2025 నాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేశాం. కానీ ఇంతవరకు అవి ఫర్నిచర్ చేయడంలో విఫలమయ్యారు.

Next Story