- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడిని ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్
స్కూల్ వ్యాన్ ఢీ కొట్టడంతో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ, జగిత్యాల టౌన్ : స్కూల్ వ్యాన్ ఢీ కొట్టడంతో యువకుడు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో స్కూల్ ఎదుట యువకుడి బంధువులు ధర్నాకి దిగిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలం శంకర్ రావు పేట గ్రామానికి చెందిన బండారి ప్రణీత్ అనే యువకుడిని ఈ నెల 06న జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ద రాంగ్ రూట్ లో వచ్చిన శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఢీ కొట్టగా తీవ్ర గాయాల పాలైన ప్రణీత్ ని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగి పదిహేను రోజుల గడుస్తున్న సదరు స్కూల్ యాజమాన్యం కనీసం పట్టించుకోకపోగా ఇదేంటి అని యువకుడి బంధువులు అడిగితే యాక్సిడెంట్ కి మాకు సంబంధం లేదని అని పత్రాలు తమ వద్ద ఉన్నాయని మీరు ఏమి చేసుకుంటారో అది చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం తో ఆగ్రహించిన బాధితుడి బంధువులు స్కూల్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యం బాధితుడి చికిత్స ఖర్చులు భరించి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






