- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ సత్యనారాయణ స్వామికి అరుదైన ప్రశంసాపత్రం
ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వైద్యులు డాక్టర్ జి. సత్యనారాయణ స్వామిని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ప్రశంసాపత్రంతో పాటు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన అశ్విని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జి. సత్యనారాయణ స్వామిని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ప్రశంసాపత్రంతో పాటు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గత 40 సంవత్సరాలుగా వైద్యవృత్తిలో సేవలందిస్తున్న డాక్టర్ సత్యనారాయణ స్వామి, కేంద్ర ప్రభుత్వ టి.బి విముక్త్ అభియాన్ పథకం కింద టి.బి వ్యాధితో బాధపడుతున్న 60 మంది రోగులకు ప్రతి నెల రూ. 4,000 విలువ చేసే న్యూట్రిషన్ కిట్లను ఆరు నెలల పాటు స్వంత ఖర్చులతో అందిస్తున్నారు. ఆయన సేవలను ప్రశంసిస్తూ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం పట్ల ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ఎలగందుల నర్సింలు, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ జెడ్పీటీసీ లక్ష్మణ్ రావు, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత, బాలరాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మండల మున్నూరు కాపు మాజీ అధ్యక్షులు నంది కిషన్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, ప్రముఖ ఫోటోగ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మండల జర్నలిస్టులు తదితరులు అభినందించారు.






