- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కళాశాల, పాఠశాల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరై పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగోలి, వాల్ పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా జిల్లాలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారని తెలిపారు. వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా అనేకమంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారని అన్నారు. మత్తు పదార్థం మానసికంగా, శారీరకంగా తీవ్ర నష్టం చేస్తుందని తెలిపారు. సమస్యను పరిష్కరించుకునేందుకు, ఒత్తిళ్లను అధిగమించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు. స్నేహితులతో మాట్లాడడం, పుస్తకాలు చదవడం సామాజిక సేవ వంటి వాటితో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్నతాధికారులు మత్తు పదార్థాల అనర్థాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ చాలా ముఖ్యమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం యువత, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారి భవిష్యత్తును అందాకారంలోకి నెట్టుతుందని అన్నారు. విద్యార్థులు, యువత ఒత్తిడిని అధిగమించేందుకు స్నేహితులు, తల్లిదండ్రులతో మాట్లాడటం, పుస్తకాలు చదవడం క్రీడలు, ఆటలు ఆడడం వంటివి అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీమ్ రావ్, డి ఐ ఓ బి గంగాధర్, సిడిపిఓ సబిత, ఎన్ఎంబీఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి పాల్గొన్నారు.






