చేసిన నేరం నుంచి త‌ప్పించుకునేందుకు కొత్త త‌ర‌హా నాట‌కం

by Ratna Kumari |

చేసిన నేరాల నుంచి తప్పించుకోవడానికి కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు నిందితులు.

చేసిన నేరం నుంచి త‌ప్పించుకునేందుకు కొత్త త‌ర‌హా నాట‌కం
X

దిశ, కరీంనగర్ రూరల్ : చేసిన నేరాల నుంచి తప్పించుకోవడానికి కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు నిందితులు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువతితో రోమాల ఉదయ్ అనే వ్యక్తి పరిచయం పెంచుకొని సదరు యువతితో నిత్యం మాట్లాడుతూ ప్రేమిస్తున్నాను అంటూ వెంటబడేవాడని సీఐ తెలిపారు. యువతి అప్పటికే తనతో పాటు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో పెళ్లి చేసుకునేందుకే నిర్ణహించుకోవడంతో రోమాల ఉదయ్ కక్షపూరితంగా సదరు యువతిని గత నెల జనవరి 18 న తన బైక్ పై తీగలగుట్టపల్లిలోని చంద్రపురి కాలనీకి తీసుకెళ్లి తన స్నేహితులతో బెదిరింపులకు గురి చేసి యువతికి కాబోయే వ్యక్తిని వదిలేయాలని హెచ్చరించడంతో పాటు ఫోన్ చేసి అతన్ని పిలిపించాలని ఒత్తిడి చేశాడు.బాధితురాలు తన కాబోయే భర్తను అక్కడకు పిలిపించగా రోమాల ఉదయ్, అతని స్నేహితులు అతన్ని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన అతను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించగా.. అతని స్నేహితులు అడ్డుకుని రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి వారి వద్ద ఉన్న బైక్ తో పాటు రూ.2 వేలు వసూలు చేసినట్లు సీఐ తెలిపారు.


ఉదయ్ సదరు యువతిని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో దింపి ఆమె కాబోయే భర్త దాడి చేసినట్లు ఫిర్యాదు చేయాలని యువతిని ఉదయ్ బెదిరించినట్లు సీఐ చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుని పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న క్రమంలో ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తన సెల్ ఫోన్ లో సెల్ఫీ వీడియోతో రికార్డ్ చేసి చేయని తప్పుకు పోలీసులు నాపై తప్పుడు కేసులు పెట్టారు అంటూ పురుగుల మందు డబ్బాతో పోలీసులను బెదిరింపులకు గురి చేసి కనబడకుండా వెళ్లిపోవడంతో సాంకేతికత సాయంతో ఉదయ్ కోసం ఆరా తీశారు. దీంతో అత‌ని ఆచూకి లభ్యం కావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని శనివారం కోర్టులో హాజరు పరిచినట్టుగా సీఐ ఏ.నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉదయ్ పై ఇప్పటికే పలు కేసులు నమోదైన‌ట్టు సీఐ నిరంజ‌న్ రెడ్డి తెలిపారు

Next Story