కాలిన ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు..

by Elthuri vijay kumar |

‘దిశ’ కి కృతజ్ఞతలు తెలిపిన అన్నదాతలు

కాలిన ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు..
X

కాలిన ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు..

- "దిశ" కథనానికి స్పందించిన అధికారులు

- ‘దిశ’ కి కృతజ్ఞతలు తెలిపిన అన్నదాతలు

దిశ, పెగడపల్లి: ‘కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్ ఎండుతున్న పొలాలు’ అనే శీర్షికన ‘దిశ’ దినపత్రికలో వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించారు. బుధవారం ట్రాన్స్‌ కో ఏడీ ఈ. వరుణ్ ఆధ్వర్యంలో కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సమస్య పరిష్కారమై పంటలకు మళ్లీ జీవం లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి మార్గం సుగమం చేసిన ‘దిశ’ పత్రికకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ మధు, లైన్ మెన్ రాజేశం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story