పోలీసుల‌ను ఆశ్ర‌యించిన ప్రేమ జంట

by Ratna Kumari |

తాము ఇద్ద‌రం ప్రేమించుకున్నాం.. ఇష్ట‌పూర్వ‌కంగానే వివాహం చేసుకున్నామ‌ని.. పెద్ద‌ల నుంచి ర‌క్ష‌ణ కావాల‌ని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి, ఎల్లారెడ్డిపేట సీఐ వెంక‌టేష్ ను కోరింది ఓ ప్రేమ జంట‌.

పోలీసుల‌ను ఆశ్ర‌యించిన ప్రేమ జంట
X

దిశ, ఎల్లారెడ్డిపేట : తాము ఇద్ద‌రం ప్రేమించుకున్నాం.. ఇష్ట‌పూర్వ‌కంగానే వివాహం చేసుకున్నామ‌ని.. పెద్ద‌ల నుంచి ర‌క్ష‌ణ కావాల‌ని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి, ఎల్లారెడ్డిపేట సీఐ వెంక‌టేష్ ను కోరింది ఓ ప్రేమ జంట‌. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లం మండేప‌ల్లి గ్రామానికి చెందిన వంగ‌ల‌రాజు(28) ఎల్లారెడ్డి మండ‌లం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన మిరుద‌డ్డి వెన్నెల (22) గ‌త నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ప్రేమించుకున్నారు. వీరిద్ద‌రూ మేజ‌ర్లు కావ‌డంతో బుధ‌వారం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ గుడిలో హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం.. పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరు కావ‌డంతో అమ్మాయి తండ్రి దేవ‌య్య త‌ల్లి రేణుక నిరాక‌రించారు. అబ్బాయి త‌ల్లి బాల‌మ‌ణి బంధుమిత్రుల స‌మ‌క్షంలో హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం.. బుధ‌వారం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ టెంపుల్ లోని ఆర్య‌స‌మాజ్ లో వివాహం చేసుకున్నారు.

Next Story