గంభీరావుపేటలో ప్రేమ వివాదం.. యువకుడి పై కత్తితో దాడి

by Ratna Kumari |

ప్రేమ వివాదం హింసాత్మకంగా మారిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.

గంభీరావుపేటలో ప్రేమ వివాదం.. యువకుడి పై   కత్తితో దాడి
X

దిశ, గంభీరావుపేట : ప్రేమ వివాదం హింసాత్మకంగా మారిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ అమన్ ఖాన్ ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేస్తున్నారని తెలుసుకుని, తన తల్లిదండ్రులతో కలిసి యువతి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన దుంపల వినీత్‌తో అమన్ ఖాన్‌కు వాగ్వాదం చోటు చేసుకుందని తెలిపారు. నీవు ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు” అంటూ అమన్ ఖాన్ తన తెచ్చుకున్న కత్తితో వినీత్‌పై దాడి చేయగా వినీత్ మెడ, చేతులపై గాయాలు అయ్యాయని తెలిపారు. వినీత్ బంధువులు ఫిర్యాదు మేరకు అమన్ ఖాన్‌తో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

Next Story