కటకటాల పాలైన లెక్చరర్.. వేదింపులకు తట్టుకోలేక ఫిర్యాదు..

by Dishafeatures2 |
కటకటాల పాలైన లెక్చరర్.. వేదింపులకు తట్టుకోలేక ఫిర్యాదు..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కలిసి చదువుకున్న పాపానికి ప్రేమించమంటూ వేధింపులకు గురి చేసి మానసికంగా హింసిస్తున్న ఓ లెక్చరర్‌ను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సంతోష్ నగర్‌కు చెందిన ఉప్పాల ఆదిత్య భరద్వాజ్ ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకుంటున్నాడు. తనతో పాటు చదువుకుంటున్న కరీంనగర్‌కు చెందిన యువతితో ఫ్రెండ్ షిప్ చేశాడు. ఆమెతో పాటు ఇతర క్లాస్ మెట్స్‌తో కూడా సన్నిహితంగా మెలిగేవాడు.

అయితే సదరు యువతి వాట్సప్‌కు 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకో' అంటూ మెసెజ్‌లు పంపేవాడు. ఆమె తిరస్కరించడంతో స్నేహితులందరితో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోలు మీ బంధువులు, స్నేహితులకు తల్లిదండ్రులకు పంపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. అంతేకాకుండా వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ తనను కాక ఎవరిని పెళ్లి చేసుకున్నా రచ్చరచ్చ చేస్తానని, కుటుంబం పరువు బజారుకు ఈడుస్తానన్న రీతిలో బెదిరింపులకు పాల్పడేవాడు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్ష రా సివస్తుండగా ఆర్ట్స్ కాలేజీ సమీపంలో హత్య చేసేందుకు యత్నించగా యువతి సోదరుడు జస్వంత్ సింగ్ అక్కడికి రావడంతో ఎప్పటికైన చంపుతానని బెదిరించి తనను పెళ్లి చేసుకోక పోతే యాసిడ్ దాడి చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

ఈ విషయం బయటకు తెలిస్తే పరువు మర్యాద మంటకలుస్తాయని భావించిన బాధితురాలి కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు. అయితే భరద్వాజ్ వేధింపులు మరింత తీవ్రతరం చేశాడు. దీంతో బాధితురాలు ఈ నెల 10న గంగాధర పోలీస్ స్టేషన్‌లో భరద్వాజ్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితున్ని సోమవారం మధ్యాహ్నం వనపర్తి సీసీఎస్, టాస్క్ ఫోర్స్, షీటీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో సంస్కృత లెక్చరర్‌గా పనిచేస్తున్న భరద్వాజ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితున్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.


Next Story

Most Viewed