- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ అధికారుల వేషంలో తిరుగుతున్న దొంగల ముఠా
"మేమ ప్రభుత్వ అధికారులం.. జనాభా లెక్కలు సేకరించడానికి వచ్చాం" అని ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త..

దిశ, కోరుట్ల రూరల్ : "మేమ ప్రభుత్వ అధికారులం.. జనాభా లెక్కలు సేకరించడానికి వచ్చాం" అని ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. వారు అధికారులు కాదు.. అధికారుల ముసుగులో వస్తున్న ఖతర్నాక్ దొంగలు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఒక దొంగల ముఠా అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. ప్రభుత్వ ఉద్యోగులమని నమ్మించి ఒక మహిళ ఒంటరిగా ఉన్న ఇంటికి వెళ్లారు. తాగడానికి మంచినీళ్లు అడిగి, ఆమెను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లగానే ఆ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి అరువకుండా నోట్లో గుడ్డలు కుక్కి 5 తులాల బంగారం, 68 తులాల వెండి ఎత్తుకెళ్లిన సంఘటన జరిగిందని కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపారు . ప్రస్తుతం ఎలాంటి జనాభా లెక్కల సేకరణ జరగడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులమని ఎవరైనా వస్తే వెంటనే వారి గుర్తింపు కార్డు అడగాలని, అనుమానం వస్తే తలుపు తీయవద్దన్నారు. ముఖ్యంగా పగటిపూట ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, మంచినీళ్లు కావాలి అని అడిగేవారిని కూడా గుడ్డిగా నమ్మి ఇంట్లోకి రానివ్వకండి. మీ వీధిలో, మీ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్లకు 8712656790, 8712656820నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.






