కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంటపై కన్నెర్ర

by velandi.Saikiran |

కులాంతర వివాహం చేసుకుందని కన్నెర్ర‌ చేసి, కన్న కూతురునే

కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంటపై కన్నెర్ర
X

దిశ, వెల్గటూర్ : కులాంతర వివాహం చేసుకుందని కన్నెర్ర‌ చేసి, కన్న కూతురునే మోసం చేసిన కిడ్నాప్ చేసే కుట్రకు త‌ల్లిదండ్రులే తెర‌లేపిన సంఘ‌ట‌న జ‌గిత్యాల‌లో చోటు చేసుకుంది. ఈ త‌రుణంలో పోలీసులను ఆశ్రయించి తల్లి దండ్రులతో ప్రాణభయం ఉందని వారిపై అమ్మాయి కేసు పెట్టిన ఉదంతం జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది. బాధిరాలు మర్రి ప్రియాంక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెల్గటూర్ మండలం రాజక్క పల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ప్రియాంక ఇరువురు ప్రేమించుకున్నారు. ఆరు సంవత్సరాల నుంచి వీరి ప్రేమాయణం కొనసాగుతోంది.

కులాంతర వివాహం కావడంతో ప్రేమ పెళ్లిని అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. అయినా రాకేష్ పైన ఉన్న ప్రేమను చంపుకోలేక తల్లిదండ్రులను ఎదిరించి, జూలై 27న ప్రియాంక రాకేష్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది. అనంతరం ఇద్దరూ రాజక్క పల్లిలోని అత్తవారింట్లో కాపురం పెట్టారు. ఇలా కొంత కాలం సాగింది. ఇంతలోనే అమ్మాయి తల్లిదండ్రులు మ‌రో కుట్ర‌కు తెర‌లేపారు. కూతురుకు ఫోన్ చేయడం ప్రారంభించారు పేరేంట్స్‌. ఇక తల్లి పదే పదే ఫోన్ చేయడంతో కూతురు క‌రిగిపోయి, తల్లితో ఫోన్ లో మాట్లాడడం ప్రారంభించింది.

సోమవారం త‌న‌కు ఆరోగ్యం బాగాలేక జగిత్యాల పోతున్నట్టు తల్లితో కూతురు చెప్పింది. దీంతో కూతురుతో క‌లిసి త‌ల్లి కూడా జగిత్యాల వెళ్లి, హాస్పిటల్లో చూపించుకున్నారు. ఆ త‌రుణంలోనే ప్రియాంకను బలవంతంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. స్థానికుల సహకారంతో ప్రియాంక వారి నుంచి బయటపడి, పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. త‌న తల్లిదండ్రులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని వారిపై వెల్గటూరు పోలీస్ స్టేషన్ లో పీర్యాదు చేసింది. కులాంతర వివాహం చేసుకున్న త‌న‌కు, త‌న‌ భర్త రాకేష్ కు పుట్టింటి వారి నుంచి ప్రాణాపాయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story