గ్రామ‌పంచాయ‌తీ కార్యాలయంలో దంపతుల ఆత్మహత్యాయత్నం

by Nallavelli.Anjaneyulu |

జగిత్యాల జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజేష్-శిరీష దంపతులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

గ్రామ‌పంచాయ‌తీ కార్యాలయంలో దంపతుల ఆత్మహత్యాయత్నం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజేష్–శిరీష దంపతులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ కుటుంబానికి చెందిన భూమిని తన తండ్రి మరణం తర్వాత అక్రమంగా తన బాబాయ్ పేరు పై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబానికి చెందిన 25 గుంటల భూమితో పాటు ఇల్లు కూడా పంచాయతీ రికార్డుల్లో మార్పులు చేసి తన బాబాయ్ పేరుపై నమోదు చేశారని ఆయన ఆరోపించారు. పంచాయతీ సిబ్బంది లంచాలకు ఆశపడి భూమిని ఇతరుల పేర్లకు మార్చారని బాధితులు తెలిపారు. ఈ విషయంపై న్యాయం కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు పంచాయతీ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి దిగినట్లు వారు తెలిపారు. అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి దంపతులను అడ్డుకున్నారు. అనంతరం చికిత్స కొరకై ఆస్పత్రికి తరలించారు. ఏకంగా పంచాయతీ కార్యాలయంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Next Story