- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్నికి ఆహుతి అయిన ఆటో
by Ratna Kumari |
కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆటో తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్దకు రాగానే ఆకస్మాత్తుగా ఆటో లో మంటలు రేగడం తీవ్ర భయందోళనలకు కారణమయింది.

X
దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆటో తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్దకు రాగానే ఆకస్మాత్తుగా ఆటో లో మంటలు రేగడం తీవ్ర భయందోళనలకు కారణమయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టాటా ఏస్ ఆటో ప్రయాణికులతో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తుండగా.. ఇంజన్ లో పొగలు రావడంతో డ్రైవర్ ఆహమద్ పాషా ఇందిరానగర్ వద్ద ఆటోను పక్కకు ఆపి అందులోని ప్యాసింజర్లను దించాడు. ఇంజన్ లో పొగలు రావడంతో డ్రైవర్ పరిశీలిస్తుండగా మంటలు ఎక్కువయ్యాయి. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కరీంనగర్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. ఆటో పూర్తిగా కాలిపోయిందని డ్రైవర్ అహ్మద్ పాషా తెలిపారు. ఆటోలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు కు చెందిన అహ్మద్ పాషా తో పాటు ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Next Story






