ముగిసిన 47 ఏళ్ల వనవాసం.. కాసేపట్లో స్వగ్రామం కోరుట్లకు దేవ్ జీ!

by Kema Shiva Kumar |

మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, సుదీర్ఘ 42 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన కోరుట్లకు తిరిగి వస్తున్నారు.

ముగిసిన 47 ఏళ్ల వనవాసం.. కాసేపట్లో స్వగ్రామం కోరుట్లకు దేవ్ జీ!
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ నేడు తన స్వగ్రామానికి చేరుకోనున్నారు. ఇటీవలే పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టిన దేవ్ జీ, దాదాపు 42 ఏళ్ల తర్వాత కోరుట్లలో అడుగుపెట్టబోతుండటం స్థానికంగా ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది. పీపుల్స్ వార్ దళ సభ్యుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, అనంతరం కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు.

మారుతున్న పరిస్థితులు, 'ఆపరేషన్ కగార్' వంటి పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 22న ఆయన లొంగిపోయారు. లొంగిపోయిన అనంతరం ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న దేవ్ జీ, నేడు తొలిసారిగా స్వగ్రామానికి రానుండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ వెళ్లి ఆయనను ఆహ్వానించి కోరుట్లకు తీసుకురానున్నారు. ఇకపై క్రియాశీల రాజకీయాల ద్వారా ప్రజా పోరాటం కొనసాగిస్తానని దేవ్ జీ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. దీంతో ఆయన రాకతో కోరుట్లలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి.

Next Story