- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగంలోకి హెలికాప్టర్లు... వరదలో చిక్కుకున్న 8 మంది సేఫ్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న 8 మందిని హెలికాప్టర్ ద్వారా క్షేమంగా

X
దిశ,గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న 8 మందిని రెండు హెలికాప్టర్ల ద్వారా క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బిగితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఐదుగురు, మరో ముగ్గురు ఇటుక బట్టి కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. హకీంపేటలోనే సైనిక హెలికాప్టర్ల ను రంగంలోకి దించి, ఎనిమిది మందిని క్షేమంగా కాపాడారు. ఈ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా అధికార యంత్రాంగం దగ్గరుండి పర్యవేక్షించారు.
Next Story






