విచ్చలవిడిగా శృంగారం.. ఇంజక్షన్ల వాడకం.. విజృంభిస్తోన్న HIV

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు ఎయిడ్స్ వ్యాధిని వ్యాప్తిని అరికట్టడం లేదు.

విచ్చలవిడిగా శృంగారం.. ఇంజక్షన్ల వాడకం.. విజృంభిస్తోన్న HIV
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ప్రభుత్వ హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు ఎయిడ్స్ వ్యాధిని వ్యాప్తిని అరికట్టడం లేదు. విచ్చల విడిగా శృంగారం, పల్లెల్లో ఇంజక్షన్ల వాడకంతో నేటికి వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏఆర్టీ సెంటర్లో వేల మంది హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులు చికిత్స పొందుతుండగా కొత్తగా నెలకు రెండు, మూడు వందల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఎక్కువగా యువత ఎయిడ్స్ బారిన పడటం దేశ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్న అంశం కాగ పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంది అనే భావన వ్యక్తం అవుతుంది

ఎయిడ్స్ బారిన పడుతున్న యువత

దేశ భవితవ్యం యువతపై ఆధారపడుతుంది. అలాంటి యువత ఈ వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఆధునిక పోకడలు క్షణిక ఆనందాలకు లోనై యువత విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకుని హెచ్ఐవీ, ఎయిడ్స్ బారిన పడుతున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పల్లెలు పట్టణాల్లో ఇంజక్షన్ల వాడకం సైతం ఎయిడ్స్ వ్యాధి విస్తరణకు కారణమవుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాల్లో విస్తరిస్తున్న ఎయిడ్స్

ఎయిడ్స్​ప్రధానంగా పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ వేగంగా విస్తరిస్తుంది. అని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి జీవోనోపాధికోసం పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలకు వలస వెల్లుతున్న యువత క్షణకాలం కోరికలు తీరిచుకునేందుకు విచ్చల విడిగా సెక్స్ లో పాల్గొనడంతో వ్యాధి బారిన పడుతున్నారు. ఆ పై వ్యాధి ని గుర్తించక కుటుంబాలు వ్యాధిబారిన పడుతున్నాయి. ప్రభుత్వాలు వ్యాధి పై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్యం వ్యాధి వ్యాప్తి కారణంగా చెబుతున్నారు.

ఏఆర్టీ సెంటర్లో బాధితులకు చికిత్స

హెచ్ఐవీ బారిన పడిన వారికి ప్రభుత్వం పెన్షన్ తో పాటు ప్రత్యేక చికిత్సను అందించేందుకు ఏఆర్టీ సెంటర్లను ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తుంది. వారికి ప్రోటీన్లతో కూడిన ఆహార పదార్థాలను, మందులను అందిస్తూ వారి ద్వార వ్యాధి విస్తరించకుండా జాగ్రత్తలు సైతం తీసుకుంటుంది. అయితే అవగాహన లేకుండా వ్యాధి సోకిన విషయం తెలియకముందు చాలా మంది విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొనడంతో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకు రెండు వందల నుండి సుమారుగా మూడు వందలవరకు కేసులు నమోదు కావడం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది

ఎయిడ్స్ సోకే విధానం

హెచ్ఐవీ, ఎయిడ్స్ ఎలా సోకుతుంది?..అనేది నేటికి అవగాహన లేని జనం ఉన్నారు అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ప్రధానంగా ఎయిడ్స్ రక్షణ లేకుండా లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి వైరస్‌ ఒక వ్యక్తి నుంచి మరొకరికి చేరుతుంది. లేదా ఇంజెక్షన్‌ల ద్వారా కూడా హెచ్ఐవీ సోకుతుంది. హెచ్ఐవీ వైరస్‌ ఉన్న వ్యక్తి రక్తం మరో వ్యక్తికి బ్లడ్ ఇస్తే వైరస్‌ సోకుతుంది.అందుకే రక్తదానం చేసే ముందు హెచ్ఐవీ పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యాధి సోకుతుంది. గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో పాలిచ్చేటప్పుడు తల్లి నుండి బిడ్డకు వైరస్‌ సోకే అవకాశం లేకపోలేదు.మారుమూల గ్రామాలలో ఆర్ఎంపీ, పీఎంపీలు విచ్చలవిడిగా సిరంజులను ఒకరికి వాడినవే మరొక్కరికి వాడటం వల్ల వ్యాధి నేటికి విస్తరిస్తూనే ఉంది.

Next Story