కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు రూ.20వేలు ఎక్స్ గ్రేషియా

by Ratna Kumari |

దిశ‌, మాల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దిగువ ప్రాంతంలోని అభయాంజనేయ విగ్రహం వద్ద గత శనివారం జరిగిన అగ్ని ప్రమాద ఘటన బాధితులకు

కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు రూ.20వేలు ఎక్స్ గ్రేషియా
X

దిశ‌, మాల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దిగువ ప్రాంతంలోని అభయాంజనేయ విగ్రహం వద్ద గత శనివారం జరిగిన అగ్ని ప్రమాద ఘటన బాధితులకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో వసంత ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి సోమవారం సాయంత్రం రూ.20,000/- వేలు అందజేసినట్లు తహసీల్దార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో 21 దుకాణాలు దగ్ధం కాక, 4 పాక్షికంగా దగ్ధమైనట్లు తెలిపారు. వారి వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి ఉన్నారు.

Next Story