- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంథనికి 13 మంది జీపీఓలు అపాయింట్మెంట్..
మంథని మండలానికి 13 జీపీఓలు నూతనంగా ఆపాయింట్మెంట్ అయ్యారు. మంథని మండలంలో మొత్తం 35 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 13 క్లస్టర్లకు 13 మంది జీపీఓలను అధికారులు నియమించారు.

మంథనికి 13 మంది జీపీఓలు అపాయింట్మెంట్..
13 క్లస్టర్లుగా 13 మంది జీపీఓలు..
దిశ, మంథని : మంథని మండలానికి 13 జీపీఓలు నూతనంగా ఆపాయింట్మెంట్ అయ్యారు. మంథని మండలంలో మొత్తం 35 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 13 క్లస్టర్లకు 13 మంది జీపీఓలను అధికారులు నియమించారు. అధికారులు నియమించిన క్లస్టర్ ఆధారంగా జీపీఓలు పని చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి స్థానంలో వీఆర్ఏలు ఉండేవారు. గత ప్రభుత్వం వీరిని తొలగించి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వీరి సేవలు గ్రామానికి, ప్రజలకు రెవెన్యూ అవసరమని గుర్తించి పరీక్ష నిర్వహించి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తమ గ్రామానికి కొత్తగా వచ్చిన జీపీఓ ఎవరు అనేదే ప్రజలకు ఇంకా పూర్తిగా సమాచారం లేదు. దీంతో తమ జీపీఓ ఎవరనేది తెలుసుకొని సర్టిఫికెట్ జారీ కాని ప్రజల సమస్యలు తమ జీపీఓల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు చెబుతున్నారు.






