- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ మేయర్ పీఠం మాదే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని మా వ్యక్తం చేశారు. ఇవాళ పట్టణంలోని త్రిధా హోటల్‌లో కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోని పట్టణ, జోన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టికెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావు లేదని తేల్చి చెప్పారు. సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ కోసం తనకు లేదా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేయవద్దని.. ఒత్తిడి తెస్తే టికెట్లు రావని బండి సంజయ్ హెచ్చరించారు. టికెట్ రాని వారికి పార్టీ లేదా నామినేటెడ్ పదవుల్లో సర్దుబాటు చేస్తామని, ఎక్కువ నామినేటెడ్ పోస్టులు దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో గొడవలు చేసే నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు. పార్టీ వదిలితే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని అన్నారు. బీజేపీ గెలుపు, ప్రయోజనాలే తమకు ముఖ్యమని, బ్లాక్ మెయిల్‌కు లొంగనని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదని, కేంద్ర నిధులతోనే ప్రగతి జరుగుతోందని విమర్శించారు. బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి చూపిస్తామని, ఇంటింటికీ ప్రచారం చేయాలని.. బోగస్ ఓట్లను పరిశీలించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు.






