- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karimnagar Corporation: కరీంనగర్లో బీజేపీకి ఎసరు!.. కాంగ్రెస్ ఖాతాలో మేయర్ పీఠం?
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ ఆధిక్యాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఎల్లుండి జరగబోయే మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కమాల్ చేస్తుందా? లేక బీజేపీ బీట్ చేస్తుందా అనేది వేచి చూడాలి.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కరీంనగర్ కార్పొరేషన్ (Karimnagar Municipal Corporation) పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. చరిత్రలో తొలిసారిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‍పై కాషాయ జెండా ఎగురుతుందని అనుకుంటున్న వేళ బీజేపీకి చెక్ పెట్టేందుకు అధికార కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుండడం ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెంటెంట్ అభ్యర్థులతో కలిసి మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతుందని, ఇదే జరిగితే ఎలాగైనా కరీంనగర్ గడ్డపై సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో మరికాసేపట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కాబోతుండటంతో కరీంనగర్ రాజకీయంపై తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ సపోర్టు!
కరీంనగర్‌లో బీజేపీని (BJP) నిలువరించేందుకు కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ (BRS) మద్దతు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే గులాబీ పార్టీ ముఖ్యనేతలతో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరపగా ఈ మేరకు బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లతో పాటు బీజేపీకి చెందిన మరికొంత మంది కార్పొరేటర్ల సహకారంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా బీజేపీకి మేయర్ పీఠం దక్కలేదు. తొలిసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్‌లో జెండా పాతుదామని ఆశించిన కమలనాథులకు కాంగ్రెస్ వేస్తున్న స్కెచ్ షాక్‌గా మారబోతున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్ సమీకరణాల నేపథ్యంలోనే
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే కరీంనగర్ గడ్డపై సమీకరణాలు మారుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకోవడంతోనే తాము ఆగిపోమని రాబోయే హైదరాబాద్ మేయర్ పీఠం సైతం తమదేనంటూ నిన్న బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ బీజేపీ ఖాతాలో చేరితే ఆ ప్రభావం జీహెచ్ఎంసీలోనూ తప్పకుండా ఉండే అవకాశం ఉంది. ఇది జరగకుండా ఉండేందుకు ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని, ఇందులో భాగంగానే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ అకౌంట్‌లో పడకుండా ఇరు పార్టీలు ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ కమాల్ చేయబోతోందా?
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా బీజేపీ 30 సీట్లు, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఏఐఎఫ్‍బీ 2, స్వతంత్రులు 10 మంది గెలుపొందారు. ఇక్కడ మేయర్ పీఠం గెలుపొందేందుకు మ్యాజిక్ ఫిగర్ 33 సీట్లు కావాల్సి ఉండగా నిన్ననే ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి బీజేపీ గూటికి చేరారు. తాజాగా మరో ఇద్దరు ఇండిపెండెంట్లు జాయిన్ అయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బండి సంజయ్ ఓటుతో ఆ బలం 38కి చేరింది. టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నప్పటికీ ఆయన స్థానిక ఓటరు కాకపోవడంతో ఆయనకు మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత లభించే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఉన్న లెక్కలు బీజేపీకి అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్ వేస్తున్న వ్యూహంతో సమీకరణాలు తారుమారు కాబోతున్నాయని బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ కమాల్ చేయబోతోందని ప్రచారంలో ఉంది.
బండి సంజయ్ రివర్స్ స్కెచ్:
కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులగు మరో వైపు బండి సంజయ్ సైతం పై ఎత్తులు వేస్తున్నారు. స్వతంత్రుల మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ లో పూటపూటకు సమీకరణాలు మారిపోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ నంబర్ గేమ్ లో ఎల్లుండి ఎవరిది పై చేయి కాబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. కాంగ్
అభివృద్ధి కోసమే మద్దతు:
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘దిశ’తో మాట్లాడుతూ.. అభివృద్ధి కోసమే కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‍కు మద్దతు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తమకు డబ్బులు ముఖ్యం కావని, నగర అభివృద్ధి ముఖ్యమని స్పష్టం చేశారు.






