- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగ్గులేని సెక్యులర్ హిందువులకు బుద్ధి వచ్చేలా చేస్తా.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి మరోసారి యూట్యూబర్ నా అన్వేషణపై ఫైర్ అయ్యారు. అన్వేష్ ఏదేదో మాట్లాడినందుకు అతడిపై ఫైట్ చేస్తే కొంతమంది సిగ్గులేని సెక్యులర్ హిందువులు అతడికి సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి మరోసారి యూట్యూబర్ నా అన్వేషణపై ఫైర్ అయ్యారు. అన్వేష్ ఏదేదో మాట్లాడినందుకు అతడిపై ఫైట్ చేస్తే కొంతమంది సిగ్గులేని సెక్యులర్ హిందువులు అతడికి సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్యులర్ హిందువులకు బుద్ధి వచ్చేలా చేయాలి అంటే తాను ఇంకా గట్టిగా ఫైట్ చేస్తానని చెప్పింది. అన్వేష్‌ను ఇండియాకు రప్పిస్తానని రప్పించే వరకు నిద్రపోను అని వ్యాఖ్యానించింది. అన్వేష్ ఇండియాకు ఎలా రాకుండా ఉంటాడో చూస్తామని చెప్పింది. ఇన్ స్టాగ్రామ్ తిరిగి వచ్చినా తిరిగి అన్నీ క్లోజ్ చేపిస్తామని హెచ్చరించింది.
అన్వేష్ యూట్యూబ్ ఛానలే తన లక్ష్యం అని వ్యాఖ్యానించింది. రేపు ఎల్లుండి సెలవు కాబట్టి సోమవారం లుక్ అవుట్ నోటీసులు జారీచేయిస్తామని హెచ్చరించింది. భారతమాతపై, సీతమ్మపై ఒట్టేసి చెబుతున్నానని అన్వేష్ ను ఇండియాకు రప్పించి తీరుతానని శపతం చేసింది. 2026లో అన్వేష్ కు బ్యాండ్ బాజా మోగిస్తామని వ్యాఖ్యానించింది. ఇక అన్వేష్ తాను ఎవ్వరికీ చెడు చేయలేదని, తను చేసిన మంచికి మంచే తిరిగి వస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎవ్వరికీ బయపడేదిలేదని తన పోరాటం కొనసాగుతుందని చెబుతున్నాడు.






