- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ చర్యలు భేష్.. కంచెగచ్చిబౌలి భూముల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
కంచెగచ్చిబౌలి భూముల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కంచ గచ్చిబౌలి భూముల్లో (Kancha Gachibowli Lands) పర్యావరణ పరిరక్షణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని పర్యావరణ పరిరక్షణ కూడా పరిగణలోకి తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. సంచలనం సృష్టించిన కంచెగచ్చిబౌలి భూముల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ భూముల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలపై గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఈ భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలను తయారు చేస్తుట్లు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించిన సీజేఐ జస్టిస్ బీఅర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకోసం చర్యలు తీసుకోవాలి. పర్యావరణం కోసం రాష్ట్రం చేస్తున్న చర్యలను అభినందిస్తున్నాం. అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు.. పర్యావరణాన్ని సమతుల్యం చెయ్యాలి. పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలను సిద్ధం చేయండి. పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే.. అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తాం. నా రిటైర్మెంట్ లోపల వీటన్నింటికీ పరిష్కారం చూపాలి' అని వ్యాఖ్యలు చేశారు. అయితే సమగ్ర ప్రణాళికను అందించేందుకు 6 వారాలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి కోర్టును కోరగా ఇందుకు న్యాస్థానం అంగీకరించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.






