- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kancha Gachibouli Lands Issue : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం రేపిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Lands Issue )లో ప్రభుత్వం(Telangana Govt) కీలక అడుగు వేసింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం రేపిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Lands Issue )లో ప్రభుత్వం(Telangana Govt) కీలక అడుగు వేసింది. ఈ భూములపై నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో అఫిడవిట్ దాఖలు చేసింది. హైదరాబాద్ లోని ప్రభుత్వానికి చెందిన కంచ గచ్చిబౌలి భూములను వేలం వేసేందుకు సర్కార్ సిద్ధం కాగా.. అవి హెచ్సీయూ భూములని, జీవ వైవిధ్యం గల ప్రాణులు, వృక్షాలు ఉన్నాయంటూ వర్శిటీ విద్యార్థులు, పౌర సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళగా.. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు చేసింది న్యాయస్తానం.
అలాగే తదుపరి విచారణ జరిగే వరకు ఆ భూముల్లో ఎలాంటి విచారణ జపరాదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. ఈ వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికారిక కమిటీని నియమించింది. అయితే ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణ ఈనెల 16న జరగనుండగా.. ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో ఆయా భూములు తమవేనంటూ పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.






