‘కామారెడ్డి’ పబ్లిక్ బీ అలర్ట్.. మరోసారి అతి భారీ వర్ష సూచన!

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-29 03:00:21  IST  )

అల్పపీడన ద్రోణి ప్రభావంతో మెదక్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఆకాశాలని చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం కురిసింది.

‘కామారెడ్డి’ పబ్లిక్ బీ అలర్ట్.. మరోసారి అతి భారీ వర్ష సూచన!
X

దిశ, వెబ్‌డెస్క్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో మెదక్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఆకాశాలని చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా కామారెడ్డి (Kamareddy), మెదక్‌ (Medak) జిల్లాల్లో చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. ఇవాళ ఉదయం నుంచి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ (IMD) పేర్కొంది. దీంతో ఆ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించారు.

ఇక మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ (Haveli Ghanapur) మండల పరిధిలోని ధూప్‌సింగ్ తండా, రాజీపేట, నాగిరెడ్డిపల్లి, బూరుగుపల్లి, వాడి, సర్దన, కొత్తపల్లి గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రహదారులన్నీ వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కరెంటు స్తంభాలు పడిపోవడంతో గత మూడు రోజులుగా అంధకారంతో ఆయా గ్రామాల ప్రజలకు గడుపుతున్నారు.

Next Story